![]() |
![]() |
.webp)
ఆదివారం విత్ స్టార్ మా పరివారం సీరియల్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఐతే ఈ షోకి ఇంటింటి రామాయణం, మగువా ఓ మగువ సీరియల్స్ నుంచి నటీనటులు వచ్చారు. ఇక ఈ ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచింది మగువ ఓ మగువ సీరియల్ లోని మెయిన్ లీడ్ చంచలమ్మ. ఈ చంచలమ్మ రోల్ ఈ సీరియల్ కె హైలైట్ గా ఉంటుంది. బాహుబలి మూవీలో శివగామి రోల్ లో రమ్య కృష్ణ ఎలా అదరగొట్టిందో ఈ సీరియల్ లో చంచలమ్మ కూడా అలాంటి గెటప్ లోనే అదరగొడుతూ ఉంటుంది. ఇక ఈ చంచలమ్మ అసలు పేరు నేత్రా జాదవ్.
ఈమె కన్నడ నటి. కానీ ఈ సీరియల్ లో ఆమె నటన చూస్తే అచ్చ తెలుగు ఇంటి అమ్మాయిలా ఉంటుంది. ఇక ఈమె పెరఫార్మెన్స్ ఈ షోలో హైలైట్ గా ఉంటుంది. "సన్నగా ఉంటుంది వైర్..ఈ చంచలమ్మ అంటే వైల్డ్ ఫైర్" అంటూ గట్టి డైలాగ్ చెప్పింది. ఇక ఆ తర్వాత సెల్ఫ్ డిఫెన్సె ఎలా చేసుకోవాలో చేసి చూపించింది. ఐతే కొంతమంది దుండగులు మన మీదకు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో చేసి చూపించింది. అలాగే హరి చంచల మెడలోని నగ లాగుతూ ఉండగా ఆమె నగను మనవైపుకు లాక్కోకుండా ఎలా ఆ దొంగను కొట్టి మనల్ని మనం, మన నగలను కాపాడుకోవాలో చేసి చూపించింది. ఐతే ఈ సెల్ఫ్ డిఫెన్సె ట్రిక్స్ అన్నీ కూడా స్కూల్ చూపించరు అని చెప్తూ తన స్టైల్ కొన్ని సెల్ఫ్ డిఫెన్స్ స్టెప్స్ చూపించింది. చైన్ స్నాచింగ్ వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో హరి మీద ఆ ట్రిక్ ప్రయోగించి చూపించింది. ఆడదంటే ఆదిపరాశక్తి అని నిరూపించిన మహిళల చరిత్ర గురించి ఎవరూ మర్చిపోకండి అంటూ స్త్రీలను గురించి మంచి మాటలు చెప్పింది చంచల అలియాస్ నేత్రా జాదవ్. ఈమె కన్నడ సీరియల్స్ లో నటించింది. అలాగే రావోయ్ చందమామ సీరియల్ లో కూడా నటించింది.
![]() |
![]() |